
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జులై 14 నుంచి తెలంగాణలో కొత్తరేషన్ కార్డులు పంపిణీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి జులై 14 నుండి రేషన్ కార్డులు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 94 లక్షల 72 వేల 422 మందికి రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు అవుతుంది.
……………………………………………………..