
* రంగారెడ్డి జిల్లాలో చిరుతల సంచారం
* రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు
* హడలిపోతున్న స్థానికులు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో చిరుతల సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. బాలాపూర్ రీసెర్జ్ సెంటర్ లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం ఓ శునకం చిరుతల చేతి మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. సీసీ ఫుటేజ్ ఆధారాలతో పాటు పాదముద్రలను పరిశీలించి రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించుకున్నారు. చిరుతలను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోనులను ఏర్పాటు చేశారు. స్థానికులు ఎవరూ ఒంటరిగా బయటకు రావొద్దని స్థానిక పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చిరుతల సంచారంతో డిఫెన్స్ రిసర్చ్ స్కూల్ కు సెలవులు ప్రకటించారు. చిరుతలను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు గాలింపులను ముమ్మరం చేశారు.
………………………………………….