* మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరు న్యూస్ ఖమ్మం ః రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి పొంగులేటి ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు.స్థానిక సంస్థల్లో బిసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మంత్రి అన్నారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్సును తీసుకొచ్చిందని ఆర్డినెన్సును వ్యతిరేకిస్తే బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదన్నారు. దేశంలోనే మొట్టమొదట కులగణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన తరువాతనే బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణానికి ఉన్న రెండు గుర్తులు అని మంత్రి అన్నారు. పైకి తిట్టుకున్నా ఈ రెండు పార్టీలు అంతర్గతంగా పరస్పరం సహకరించుకుంటాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తాయని మంత్ర ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ న్యాయం జరుగుతుందని,కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని మంత్రి పొంగులేటి కార్యకర్తలను పార్టీ నాయకులను కోరారు.
……………………………………………
