MP Kadiyam Kavya in Lok sabha
* లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్ , డెస్క్ :
వరంగల్ జిల్లాలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ లేకపోవడంపై లోక్‌సభలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్రాన్ని ప్రశ్నించారు. జిల్లాలో కేంద్ర సంక్షేమ పథకాల ప్రచారం, మీడియా అవుట్‌రీచ్ కార్యక్రమాలు, కమ్యూనిటీ రేడియో ఏర్పాటుకు అందుతున్న సహాయంపై ఆమె సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను నిలదీశారు.
వరంగల్ జిల్లాలో ప్రస్తుతం ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేదని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అయితే, గత మూడేళ్లలో జిల్లాలో 17 ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ అండ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించినట్లు తెలిపారు.
కేంద్రం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వరంగల్‌లో రేడియో స్టేషన్ ఏర్పాటు కాకపోవడం దురదృష్టకరమని ఎంపీ అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా, వరంగల్‌కు రావాల్సిన ప్రతి అవకాశాన్ని పార్లమెంట్లో సాధించుకుంటానని ఆమె స్పష్టం చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
