
* తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రి వద్ద ఘటన
* ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ః కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఉదయం సికింద్రాబాద్ నుంచి తన అనుచరులతో కలిసి మూడు వాహనాల్లో
మాణికేశ్వర్ నగర్లో బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయలు దేరిన ఎమ్మెల్యే పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎమ్మెల్యే కారు తార్నాకాలోని ఆర్టీసీ ఆస్పత్రి వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించిన దుండగులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే గన్ మెన్ ల వద్ద ఉన్న వెపన్స్ను లాక్కోవడానికి యత్నించారు. దుండగుల దాడి నుంచి తప్పించుకున్న ఎమ్మెల్యే సమీపంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సుమారు 50 మంది తనపై దాడికి యత్నించినట్లు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి యత్నించిన దుండగులు విద్యానగర్ వైపు వెళ్లినట్లు సమాచారం. ఓయూ పోలీసులు కేసు నమోదే చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………..