
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః కేరళ మాజీ ముఖ్యమంత్రి వెలిక్కకట్టు శంకరన్ అచ్యుతానందన్ కన్ను మూశారు. 101 ఏళ్ల అచ్యుతానందన్ త్రివేండ్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వృద్ధాప్య భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.1923లో జన్మించిన అచ్యుతానందన్ సీపీఐఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆయన 2006 నుండి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.2016 తరువాత ఆయన వయో భారంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1940లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడయ్యారు. అనంతరం ట్రావెన్కోర్ సంస్థానానికి చెందిన భూస్వాములపై పోరాటం చేసి.. జైలుకు సైతం వెళ్లారు. ఆ తర్వాత 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్ను ఆయన వదిలేశారు. అనంతరం సీపీఎం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 1967 నుంచి 2016 వరకు వరుసగా ఆయన అసెంబ్లీకి ఎన్నికైయ్యారు.
………………………………………..