
* నర్సింగ్ హాస్టల్లో ఊడిపడిన పై కప్పు పెచ్చులు
ఆకేరున్యూస్, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నర్సింగ్ స్టాఫ్ హాస్టల్ భవనం పెచ్చులూడి కింద పడ్డాయి. ఆ సమయంలో గదిలో ఎవరూ లేక పోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎంజీఎంలో వరుసగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని సిబ్బంది, రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన భవనంలోనే నర్సింగ్ స్టాఫ్ హాస్టల్ నిర్వహిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. భవనాలకు మరమ్మతు చేయాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.గత నెలలో కూడా సర్జికల్ వార్డులో పెచ్చులూడి కింద పడగా రోగులు భయభ్రాంతుకు గురయ్యారు. వరుసగా ఇలాంటి సంఘటలు జరుగుతుండడంతో రోగులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరుకున్న భవనాలను మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
…………………………………………