
ఆకేరు న్యూస్, జనగామ: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన భర్త రాజరామ్మోహన్ రెడ్డి గారితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో స్వామి వారి ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి, వేద పండితుల ఆశీర్వాదం పొందారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం స్వామిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
…………………………….