
*చంద్రబాబుకు పావుగా బీజేపీ
* టీడీపీ, బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రణాళికలు
* బీజేపీలో బీఆర్ ఎస్ విలీనంపై గంగుల కమలాకర్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : విలీనంపై ఎప్పుడూ చర్చ జరగలేదని, ఇది సీమాంధ్ర నేతల కుట్ర అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ (GANGULA KAMALAKAR)అన్నారు. బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ(BJP)లో బీఆర్ ఎస్ (BRS)విలీనం అంశంపై ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. పదేళ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సీమాంధ్రులు ఇటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఇప్పుడు తమపై దాడి చేస్తున్నారని అన్నారు. సీఎం రమేష్ (CM RAMESH) మాటలు కూడా అందులో భాగమే అన్నారు. ఆయన తమ పార్టీ గురించి మాట్లాడలేదని అన్నారు. తెలంగాణలో లేని బీజేపీతో తామెందుకు కలుస్తామని, కచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు వెళ్తామన్నారు. రాబోయే కాలంలో వంద సీట్లు గెలుస్తామన్నారు. విలీనం అంశం గురించి తప్పుకునే అవసరం లేదని తెలిపారు. చంద్రబాబు కుట్రలోనే భాగంగానే బీజేపీ పావుగా మారిందన్నారు. భవిష్యత్ లో టీడీపీతో కలిసి బీజేపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. ఇది తెలంగాణపై మళ్లీ విషం చిమ్మే ప్రణాళికలో భాగమని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదన్నారు. బీసీలను కాంగ్రెస్, బీజేలు మోసం చేశాయన్నారు. బీఆర్ ఎస్, కేసీఆర్ బీసీల పక్షపాతి అని, దానికి వంద ఉదాహరణలకు చెబుతా అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కావాలని సీరియస్ గా కొట్లాడిన పార్టీ తమది మాత్రమే అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయిండని ప్రశ్నించారు. ఆయా పార్టీల కుట్రతోనే కదా అన్నారు. ఈసారి తప్పకుండా సాధించుకుంటామన్నారు.
…………………………………….