
* సీఎం రమేష్ వీడియో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు..
* వీటికి కేటీఆర్ సమాధానం చెప్పాలి
* రేవంత్ రెడ్డి ఓకే అంటే రాష్ట్రంలో తిరగనీయం..
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శలు
ఆకేరు న్యూస్, వరంగల్ : బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి (Nayini Rajender Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరంపై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పాపాలు బయటకు రాకుండా బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. సీఎం రమేష్ (C.M.Ramesh) మాట్లాడిన మాటలకు కేటీఆర్ (KTR) సమాధానం చెప్పాలన్నారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదన్నారు. తాము చేసిన పాపాలను బయటకు తవ్వొద్దు.. మమల్ని బయటకు లాగొద్దు.. తాము బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామని సొంత చెల్లెలు చెప్పిందిగా అన్నారు. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం కావాలా అన్నారు. సీఎం రమేష్ అయితే వీడియో సాక్ష్యాలు ఉన్నాయంటున్నారని తెలిపారు. వాటిపై మాట్లాడకుండా గూండాయిజం, రౌడీయిజం చేస్తున్నారని అంటారా అని ప్రశ్నించారు. ఐపీఎస్, ఐఏఎస్ లను కూడా వదిలిపెట్టబోమని హెచ్చరికలు చేస్తూ మీరు గూండాయిజం చేస్తున్నారని అన్నారు. ఒక్కసారి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని కానీయండి అని ఒక్కమాట చెబితే.. మిమ్మల్ని హైదరాబాద్ లోనే కాదు.. రాష్ట్రంలోనే తిరగనీయబోమని కేటీఆర్ ను హెచ్చరించారు. నీళ్లు-నిధులు-నియామకాల పేరుతో మోసం చేసిన ఆంధ్రా పాలకుల కంటే భయంకరమైన దోపిడీ కేసీఆర్ కుటుంబం చేసిందని ఆరోపించారు.
……………………………….