
ఆకేరు న్యూస్, ములుగు: ఆదివాసి ఆరాధ్య దైవాలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని వనవాసి కళ్యాణ పరిషత్ ములుగు జిల్లా కార్యదర్శి మై పతి సంతోష్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడం హర్షించదగిన విషయమని స్థానిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
ఆసియా ఖండం లో అతి పెద్ద గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు తో జరిగే జాతర కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని ఈ ప్రాంత గిరిజన ప్రజల కోరుకుంటున్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు పీసా చట్టం ప్రకారం జరగాలని కోరారు. మేడారం జాతర ప్రభావం ఊరటం, రెడ్డిగూడెం, నార్ల పూర్ ,కొత్తూరు పడిగాపూర్ ,వెంగళాపూర్, బయ్యకపేట తదితర గ్రామంలో ఉంటుందని చెప్పారు. అయితే మేడారం జాతర పరిసల అన్ని గ్రామాలను కలిపి స్వయం ప్రతిపత్తి ప్రాంతం గా ప్రభుత్వం గుర్తించాలని అప్పుడే గిరిజన సంస్కృతి పరిరక్షణ జరుగుతుంది ఆన్నారు.అబివృద్ధి పేరిట అక్రమ వలసల తో సంస్కృతికి ప్రమాదం పొంచి ఉందని,ప్రభుత్వం భారత రాజ్యాంగం 5 వ షెడ్యుల్ 1 నీ అనుసరించి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాన్నారు. జాతర నిధులు ప్రతీ గూడెం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రభుత్వం ను కోరుతున్నామన్నారు.
…………………………………………….