
* 15 లక్షల విలువైన 50 కిలోల గంజాయి స్వాధీనం
* పోలీసుల అదుపులో అంతార్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్
ఆకేరు న్యూస్ ,హనుమకొండ:హసన్ పర్తి రైల్వే స్టేషన్ వద్ద గంజాయి సరఫరా చేసే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 15లక్షల 14 వే 500 విలువ చేసే 50 కిలోల గంజాయిని స్వాథీనం చేసుకున్నట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం లో తెలిపారు. నిందితుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన అశిష్ కుమార్ అని ఏసీపీ తెలిపారు. ఎల్లాపూర్ సమీపంలో హసన్ పర్తి ఎస్ ఐ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి రెండు బ్యాగులు పట్టుకొని అనుమానాస్పదంగా సంచరిస్తుండంతో హసన్ పర్తి పోలీసులు అతన్ని పట్టుకొని విచారించినట్లు ఏసీపీ తెలిపారు. అశిష్ కుమార్ ను విచారించగా తమది పేద కుటుంబం అని తండ్రి మేస్త్రీ పని చేస్తాడని తల్లి కూలీ పనికి వెళ్తుందని తెలిపాడు. డబ్బులు సరిపోక పోవడంతో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలపాడు. సుమారు ఆరేళ్ల క్రితం జమీర్ అనే వ్యక్తి తనకు పరిచయం అయ్యాడని తెలపాడు. అతని ద్వారానే గంజాయి సరఫరా చేయడం నేర్చకున్నట్లు తెలిపారు,గంజాయి రవాణా చేస్తూ ఒరిస్సా లోని బరంపురంలో పోలీసులకు చిక్కి 9 నెలల జైలు శిక్ష అనుభవించామని తెలిపాడు. ఈ క్రమంలోనే జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ ఇదే పని చేస్తున్నట్లు ఆశిష్ కుమార్ ఒప్పుకున్నాడు. ఆ తరువాత ఒడిష్సాకు చెందిన ప్రశాంత్ మాలిక్ వద్ద 1500 విలువ గల గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని షోలాపూర్లో మహాదేవి కాలే అనునతనికి విక్రయించినట్లు ఆశిష్ కుమార్ తెలిపాడు. మళ్లీ ఈ నెల 24వ తేదీన ప్రశాంత్ మాలిక్ వద్ద 30 కిలోల గంజాయి తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా కోణార్క్ ఎక్స్ప్రెస్ ద్వారా వరంగల్ కు చేరుకున్నట్లు తెలిపాడు.వరంగల్ చుట్టుపక్క ఏరియాలో రెండు రోజులు ఉండి 28న గంజాయి బ్యాగ్ లతో హసన్ పర్తి రైల్వే స్టేషన్ నుండి మహారాష్ట్ర వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా హసన్పర్తి పోలీసులు పెట్రోలింగ్ కు వెళ్లిన ఎస్ ఐ దేవేందర్ బృందానికి చిక్కాడని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి విలేకరులకు వివరించాడు అతడి వద్ద నుండి 15లక్షల 14 వే 500 విలువ చేసే 50 కిలోల గంజాయిని స్వాథీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.
…………………………………………….