ఆకేరు న్యూస్, ములుగు: ఉపాధ్యాయ అపరిస్కృత సమస్యల పరిష్కారానికి దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటిన జిల్లా కేంద్రాల్లో జరుగు ధర్నాను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుతారి పాపారావు కోరారు. మంగళవారం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల తాడ్వాయి,జెడ్ పి హెచ్ ఎస్ కాటాపూర్ పాఠశాలలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపైన గత రెండు సంవత్సరాల నుండి అమలు కానీ పిఆర్సి,పెండింగులో ఉన్న డి ఏ లను ప్రకటించాలని వివిధ కేడర్ల బదిలీలకు షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పిఎస్ హెచ్ఎం లో ప్రమోషన్స్ కల్పించాలని అర్హత గల ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ను వెంటనే ప్రకటించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలన్నారు .కేజీబీవీ యుఆర్ఎస్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస బేసిక్ పే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ,పాత పెన్షన్ విపునర్దించాలని నూతన జిల్లాలకు డీఈవో పోస్టులు ప్రతి రెవిన్యూ డివిజన్ కు ఉపవిద్యా అధికారులను నియమించాలని కోరారు.సమస్యల పరిష్కారం చేపట్టే ఈ ధర్నాను విజయవంతం చే యలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు రేగ నరేంద్ర కుమార్ ,డిటిఎఫ్ నాయకుడు గుమ్మడి ప్రభాకర్ , ఉపాధ్యాయులు నారాయణ, గోపాల్ ,లక్ష్మి, రేవతి, సరోజన ,సునీత ,పద్మ ,ఉషారాణి , లక్ష్మి , బి సుధాకర్ ,అక్బర్ బాషా కోడూరు సమ్మయ్య ,రాజేష్, జయపాల్ ,మోహన్, విజయ, తదితరులు పాల్గొన్నారు.

………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
