
* ఏకకాలంలో 8 ప్రాంతాల్లో
* హైదరాబాద్లోనే 6చోట్ల
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గొర్రెల పంపిణీలో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించిన ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు తెలంగాణ (Telangana)వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 10 మంది అధికారులను అరెస్ట్ చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. లోలోనా (LOLONA) పేరుతో ప్రభుత్వ స్కీమును స్కాముగా మార్చారని మొయినుద్దీన్పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో మొయినుద్దీన్ విదేశాలకు వెళ్లిపోయారు. గొర్రెల పంపిణీ పథకంలో రూ.2.10 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభం కాగా.. మొత్తం రూ. 700 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పథకంలో ‘లోలోన’ సంస్థ ప్రమేయం ఏమిటీ, ఓ ప్రైవేటు వ్యక్తి కనుసన్నల్లో ప్రభుత్వ అధికారులు పనిచేసేలా ఎందుకు మౌకిక ఆదేశాలు ఇచ్చారనే విషయంపైనా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు నిమిత్తం ఏకకాలంలో 8 చోట్ల సోదాలు జరుగుతుండగా, ఒక్క హైదరాబాద్(Hyderabad)లోనే 6 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి.
…………………………………