* కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసే అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు విచారణను ఢిల్లీ పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మరో ఐదుగురికి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పోలీసులు వారు ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందలేదు. ఆ సోషల్మీడియా అకౌంట్ ను తాను నిర్వహించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తన లాయర్ ద్వారా వివరణ పంపారు. ఈ కేసులో గాంధీభవన్ లో ఉన్న టీపీపీసీసీ సోషల్మీడియాకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఆ విభాగంలో పని చేస్తున్న గీతతోపాటు నలుగురికి నోటీసులు అందాయి. మే 5న విచారణకు హాజరుకావాలని గీతకు పంపిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఇంతలోనే ఢిల్లీ పోలీసులు ఈరోజు హైదరాబాద్ కు చేరుకోవడం ఉత్కంఠగా మారింది. ఈకేసులో పలువురిని విచారించే అవకాశం ఉంది. విచారణ చేసి వెళ్లిపోతారా, ఎవరిని అయినా అరెస్ట్ చేస్తారా అనే చర్చ నడుస్తోంది.
————————