
* మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
* కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆకేరు న్యూస్, బాపట్ల : ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లోని బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్వారీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లా (Bapatla District)లో ఆదివారం ఉదయం బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ఒక్కసారిగా రాళ్లు విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయానికి క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలిసింది. వీరంతా ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారికి చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు. క్వారీలో రాళ్లు ఒక్కసారిగా పడటంతో వాటి కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో నర్సారావుపేట (Narsaraopeta) ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరు మృత దేహాలను బయటకు తీసినట్టు అధికారలు తెలిపారు. బండరాళ్ల కింద చిక్కుకున్న మృత దేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వీటిని వెలికితీస్తే ఎన్ని మృతదేహాలు ఉన్నాయనేది స్పష్టత వస్తుంది
…………………………………………………….