
* చెల్లికి ఇష్టం లేని కోర్సుల్లో చేర్పించొద్దు
* నాకు తక్కువ మార్కులు వస్తే మీరు తట్టుకోలేరు
* సెకండ్ ఇయర్ చదవడం నావల్ల కాదు
* మరణించే ముందు తల్లిదండ్రులకు లేఖ రాసిని ఇంటర్ విద్యార్థిని
ఆకేరున్యూస్, హనుమకొండ: మమ్మీ చెల్లిని మంచి కాలేజీలో చేర్పించండి..చెల్లికి ఇష్టమైన కోర్సులోనే చేర్పించండి,,నాలా చెల్లి బాధపడొద్దు.చెల్లీ మంచిగా చదుకో..అందరూ బాగా ఉండండి అంటూ.. ఓ ఇంటర్ విద్యార్థిని లేటర్ రాసి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుంది. మంచిర్యాలకు చెందిన మిట్టపల్లి శివాని (16) అనే అమ్మాయి నయీంనగర్ లో ఉన్న ఎస్ ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ చదువుతోంది. కాగా ఆదివారం హాస్టల్ గదిలో అనుమానాస్పదంగా మృతిచెంది ఉంది. మృతి చెందిన స్థలంలో అమ్మాయి రాసిన లెటర్ ఉంది. ఆ లెటర్ లో తనకు చదువు అర్థం కావడంలేదని పేర్కొంది. నాకు టెన్షన్ గా ఉంటోంది .. మీరు చదువుకోమన్న చదువు నాకు అస్సలు అర్థం కావడం లేదని ఆ లేఖలో రాసింది.ఈ ఏడాది మీరు ఫీజు కట్టారు కదా అని ఎలాగూ మొదటి సంవత్సరం చదువుకున్నా… ఇక నావల్ల కావడం లేదు అంటూ ఆ లేఖలో పేర్కొంది.నాకు తక్కువ మార్కులు వస్తే మీరు తట్టుకోలేరు అందుకే చనిపోతున్నా అంటూ ఆ లేఖలో పేర్కొంది, ఎంత చదివినా మార్కులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనలా తన చెల్లి జీవితం కాకూడదు అని పేర్కొంది. చెల్లికి ఇష్టమైన కోర్సులోనే చదివించాలని తల్లిదండ్రలను ఆ లేఖలో కోరింది. ఇదిలా ఉండగా విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.
………………………………………