
* ఎర్రవెల్లి ఫాం హౌజ్లో ఏర్పాట్లు
ఆకేరు న్యూస్ డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR)మరో యాగానికి సిద్ధమయ్యారు. కాళేశ్వరంపై పిసీ ఘోష్ ప్రభుత్వానికి తన నివేదికను అందించిన తరువాత ఇప్పుడు కేసీఆర్ నిర్వహించే యాగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతికూల పరిస్థితులను అధికమించడానికే కేసీఆర్ చండీయాగాని( CHANDIYAGAM) కి సిద్ధమయ్యారని రాజకీయ విశ్లేలకులు అభిప్రాయపడుతున్నారు. సీఎంగా ఉన్నపుడు ఎర్రవెళ్లి (ERRAVELLY FARM HOUSE) వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున యాగం నిర్వహించారు. మళ్లీ నేటి నుంచి మూడు రోజుల పాటు చండీ యాగం నిర్వహిస్తున్నారు. 15 మంది రుత్వికులతో మూడు రోజుల పాటు అంటే సోమ,మంగళ,ఆది వారాలు ఈ యాగం నిర్వహించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు.సోమవారం పుత్ర ఏకాదశి కావడంతో యాగం ప్రారంభిస్తున్నట్లు సమాచారం.కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి అత్యంత నిష్టతో యాగం నిర్వహించనున్నారు.. ఫాం హౌజ్ లో బీఆర్ ఎస్ ముఖ్యనేతలు యాగం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నిన్నటి నుంచి హరీష్ రావు,(HARISH RAO) వేముల ప్రశాంత్ (VEMULAPRASHANTH REDDY) అక్కడే ఉన్నారు. ముఖ్య నేతలందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు (KALESHWERAM PROJECT)పై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై చర్చించినట్లు సమాచారం.
……………………………………………………..