
* ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAS) అసెంబ్లీ ఆవరణలో ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహం ముందు ఆందోళన చేపట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు (SUPRIME COURT) ఇచ్చిన తీర్పును త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్(SPEAKER GADDAM PRASAD KUMAR)ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాలయానికి వెళ్లింది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని నినానాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
……………………………………………………..