
* హైదరాబాద్ లో మొదలైన వాన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో భారీ వర్షాలు అంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన కాసేపటికే రాజధాని హైదరాబాద్(Hyderabad)లో వాన మొదలైంది. కూకట్పల్లి, మియాపూర్, కృష్ణానగర్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం దితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు చెరువులగా మారాయి. కాగా, సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(Warangal), హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. గురువారం మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో.. శుక్రవారం నల్గొండ(Nalgoda), నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్(Yello Allert)ను జారీ చేసింది.
……………………………………..