
– కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు సరఫరా చేయాల్సిన ఇసుకకు సంబంధించి మండలంలోని నేరెళ్లలో ట్రాక్టర్ యజమానులు, ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, లబ్ధిదారులు, ప్రజలతో ఎంపీడీవో గుండె బాబు కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎమ్మార్వో సురేష్ లతో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి,మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ గ్రుహ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక రవాణా చేయాలని,రవాణా చార్జీలు మాత్రమే నుండి తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం
– సిఐ హరికృష్ణ
కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ… ట్రాక్టర్ యజమానులు, ఇసుక రవాణా దారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా చేయాలని అన్నారు.రాత్రి వేళలో, అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే ట్రాక్టర్లను సీజ్ చేసి, బాధ్యుల పైన క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు.
కూపన్లు తీసుకునే ఇసుక తరలించాలి
– ఎమ్మార్వో సురేష్
సమావేశంలో ఎమ్మార్వో సురేష్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ నుండి ఇందిరమ్మ లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేశామని,ఆ ఇసుక టోకెన్ల ఉన్న ట్రాక్టర్ లు మాత్రమే సరఫరా చేయాలని అన్నారు.పోలీసులు తనిఖీ చేస్తే విధిగా ఆ టోకెన్లను చూపించాలని అన్నారు.
…………………………………..