
*యుగాంతాన్ని తలపిస్తున్న రష్యా పరిస్థితి
ఆకేరు న్యూస్, డెస్క్ : రష్యా పై ప్రకృతి (russia) కన్నెర్ర జేసినట్లుగా అన్పిస్తోంది. ఒకే సారి భూమి ,నీరు,నిప్పు,గాలి రష్యాపై తిరగపడుతున్నాయి. వరుస భూకంపాలు,సునామీలు, అగ్ని పర్వత (volcano) విస్ఫోటనాలతో రష్యా ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. ఇంటో ఉండలేని పరిస్థితి,బయటకు వెళ్లలేని పరిస్థితి..భవనాలు కదులు తున్నాయి.. భారీ వాహనాలు ఊగుతున్నాయి..స్విమ్మంగ్ పూల్లలో సునామీలు వస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రష్యా ప్రజలపై ప్రకృతి కన్నెర్ర జేసింది. ప్రకృతి ప్రకోపానికి రష్యా ప్రజలు వణికి పోతున్నారు.
మరోసారి కంపించిన రష్యా..
తాజాగా కురిల్ దీవి(kuril iland)లో మరోసారి భూమి కంపించంది. రిక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదైంది. వారంలో ఇది మూడో సారి. గత బుధవారం 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది. ఇక క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలవడంతో కామ్చట్కాలో (Krasheninnikov) ఆదివారం భూ ప్రకంపణలు వచ్చాయి. తాజాగా మరోసారి కామ్చట్కాలో భూకంపం వచ్చింది. కామ్చట్కా తీరంలో (Kamchatka Coast) మంగళవారం 6.0 తీవ్రతతో భూమి కంపించింది.బుధవారం నాటి భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతోపాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తయిన అలలు వరుసగా దాడి చేశాయని స్థానికులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టకొని ఎత్తయిన ప్రదేశాలవైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హవాయి రాజధానిలో రోడ్లపై కార్లు, వాహనాలు కొన్ని గంటలపాటు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.కాగా, సుమారు ఆరు శతాబ్దాల కాలం నాటి క్రాషెనిన్నికోవ్ అగ్నిపర్వతంలో విస్ఫోటనం సంభవించింది. ఆదివారం జరిగిన ఈ భారీ విస్ఫోటనంతో సుమారు 6 కిలోమీటర్ల ఎత్తువరకు బూడిద, ధూళి ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి. గత బుధవారం నాటి భూకంపం ప్రభావం వల్లే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతోందని రష్యా అధికారులు వెల్లడించారు. అదృష్టవశాత్తు అది ప్రయాణిస్తున్న మార్గంలో ఎలాంటి జనావాసాలు లేవని, దాంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.ఇప్పటివరకు జనావాస ప్రదేశంలోనూ బూడిద పడినట్లు సమాచారం లేదని రష్యా అధికారులు చెప్పారు. అయితే అగ్నిపర్వతం నుంచి ఇంకా స్వల్ప స్థాయిలో విస్ఫోటనాలు కొనసాగే అవకాశం ఉందని కామ్చట్కా వోల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీమ్ (KVERT) హెచ్చరించింది. ఈ విస్ఫోటనం జరిగిన సమయంలోనే 7.0 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు తెలిపింది. ప్రస్తుతం రష్యాలో ఎమెర్జెన్సీ ప్రకటించినట్లు తెలుస్తోంది.
………………………………..