
* బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
ఆకేరు న్యూస్ ,హైదరాబాద్: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు( GUVVALA BALARAJU) బీఆర్ ఎస్ (BRS)కు రాజీనామాచేసి తన అనుచరులతో బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యేలు హర్షన్ వర్దన్ రెడ్డి(HARSHAVRDHAN REDDY),మర్రి జనార్ధన్ రెడ్డి (MARRI JANARDHAN REDDY)లు కూడా బీఆర్ ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మర్రి జనార్ధన్ రెడ్డి,బీరం హర్షన్ వర్దనన్ రెడ్డిలు తాము పార్టీ మారడం లేదని బీఆర్ ఎస్ లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. పార్టీ పటిష్టత కోసం పని చేస్తామని కేసీఆర్ ,కేటీఆర్ (KTR0నాయకత్వంలోనే కొనసాగుతామని వెల్లడించారు.అయితే కాళేశ్వరం రిపోర్టు ప్రభావం బీఆర్ ఎస్ పార్టీపై పడనుందనే ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15 తరువాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలకు కేసీఆర్ (KCR)హాజరై కాళేశ్వరం రిపోర్టుపై (KALESHWERAM REPORT) జరిగే చర్చలో పాల్గొంటేనే ఆయనపై విశ్వనీయత ఉంటుంది కాని చర్చకు రాకుండా ముఖం చాటేస్తే మాత్రం బీఆర్ ఎస్ పార్టీలో జరిగే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను ఏ తప్పు చేయలేదనే నమ్మకం కేసీఆర్ కు ఉంటే రాష్ట్ర ప్రజల ముందు పార్టీ కేడర్ ముందు నిరూపించుకోవాల్సిన బాధ్యత అవసరం కేసీఆర్ కు ఉంది. కాళే శ్వరం రిపోర్టు కాదు అది కాంగ్రెస్ రిపోర్టు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానిని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో దానికి కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటంది. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పార్టీ నాయకులకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలి లేకుంటే గువ్వల బాలరాజు బాటలోనే మరికొందరు వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేలకులు అభిప్రాయపడుతున్నారు.
………………………………