
* బీఆర్ ఎస్ కు రెడిమేడ్ నాయకులు కావాలి
* మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలను కామెంట్స్ చేశారు. ఈ మేరకు గువ్వల బాలరాజు కొంత మంది సన్నిహితులతో మాట్లాడినట్లు సమాచారం. ‘బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని లేదా విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు మనం బీఆర్ ఎస్ లో ఉండి ఏం లాభం బీఆర్ ఎస్ కంటే ముందే బీజేపీలో చేరితే బాగుంటుంది అనే అభిప్రాయం వెలిబుచ్చారు.పార్టీలో తనను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇచ్చారు… ఆ విషయం తనను బాధించింది’ అని గువ్వల బాలరాజు మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత ఆదివారం బాలరాజు బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో భేటీ అయినప్పటి నుండి ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు బాలరాజు భావోద్వేగంతో కూడిన రాజీనామా లేఖను రాశారు. సులభంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, అనేక విషయాలను ఆలోచించిన తర్వాతే బాధతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు దశాబ్దాలుగా పనిచేయడం తనకు గర్వంగా ఉందని, ఇలాంటి కష్ట సమయంలో పార్టీని వీడటం తనకు బాధగా ఉందని ఆయన తెలిపారు. 2014 నుండి 2023 వరకు అచ్చంపేట ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు.
………………………………..