
* బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి బడే నాగ జ్యోతి
ఆకేరు న్యూస్, ములుగు: కాలేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ హయాంలో నిర్మించారనే అక్కసుతో కాంగ్రెస్ నాయకులు ఓర్వ లేని కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గం ఇంచార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు లు ఆరోపించారు. మంగళవారం ములుగు జిల్లా కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్ పై పవర్ ప్రజెంటేషన్ ప్రసారాన్ని వీక్షించారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అసత్య ప్రచారాలను తిప్పుకొట్టాలని కోరుతూ హైదరాబాదులోని తెలంగాణ భవన్ నుండి మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఒక గుండెకాయ అని అన్నారు.అలాంటి కాలేశ్వరం ప్రాజెక్టును కమిషన్లు పేరుతో, కమిటీ నివేదికల పేరిట కెసిఆర్ పై కుట్రలు దిగుతున్నారని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలిందని అంటున్నారని.కాళేశ్వరం నీళ్లే గందమల్ల ప్రాజెక్టుకు ఎట్లా పోతున్నాయో సమాధానం చెప్పాలిసిన అవసరం ఉందని అన్నారు. అంతే కాకుండా మల్లన్న సాగర్ నుండి నీళ్లు మూసీలోకి నీళ్లు పోయడానికి రూ.6000 కోట్లకు టెండర్లు ఎలా ఫైనల్ చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కెసిఆర్ దూరదృష్టంతో చేపట్టిన చర్యలు లో భాగంగానె కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు తరాల కోసమే అని అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను గ్రామ గ్రామాన తిప్పి కొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే కాలేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కమిషన్ల పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, వేములపల్లి బిక్షపతి, ములుగు మండల అధ్యక్షుడు స్థానికొమ్ము రమేష్ రెడ్డి, వెంకటాపూర్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్, తాడువాయి మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మాజీ జడ్పిటిసిలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….