
* తమిళనాడులో చోటుచేసుకున్న దారుణం
ఆకేరు న్యూస్ డెస్క్ : ఇద్దరి మధ్య తగువు మూడో వ్యక్తి ప్రాణం తీసిందనే చందంగా .. తండ్రీ కుమారుల గొడవను ఆపేందుకు వెళ్లిన ప్రత్యేక ఎస్ఐ ప్రాణాలు పోయాయి . ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్ జిల్లా కుడిమంగళం (kudimangalam) సిక్కనూత్తు (sikkanutthu) ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. మడత్తుకుళం (madathukulam) ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్ కు చెందిన తోటలో పని చేస్తున్న తండ్రీ కొడుకులు మూర్తి (murthy)ఆయన కుమారుడు తంగపాండి (Thangapandi) ఘర్ణణ పడ్డారు. కాగా, మంగళవారం రాత్రి మద్యం మత్తులో జరిగిన గొడవలో తంగపాండి తన తండ్రి మూర్తిని కొట్టాడు. ఈ విషయం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా కుడిమంగళం పోలీస్ స్టేషన్ ప్రత్యేక ఎస్ఐ షణ్ముగవేల్ (shanmugavel) (57), ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మధ్య గొడవను ఆపారు. తండ్రీకొడుకులను ఫొటోలు తీసేందుకు ఎస్ఐ షణ్ముగవేల్ ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడి వచ్చిన మూర్తి మరో కుమారుడు మణికందన్ (Manikandan) కత్తితో షణ్ముగవేల్, కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఎస్ ఐ షణ్ముగవేల్ అక్కడిక్కడే ప్రాణాలు విడువగా, కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు కారకులైన మూర్తి, మణికంఠన్‌ను పోలీసులు అరెస్టు చేసి, తంగపాండి కోసం గాలిస్తున్నారు.
………………………………………