
* అప్రమత్తంగా ఉండాలన్న వరంగల్ కలెక్టర్
* సిబ్బందికి ఆదేశాలు జారీ
ఆకేరు న్యూస్, వరంగల్ : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరంగల్ ఆగమాగమైంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరద పోటెత్తింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనేపథ్యంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద (Satya Sharada) అప్రమత్తం అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో సమీక్ష జరిపారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కీలక అధికారులు కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆదనవు కలెక్టర్, జిల్లా, మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల కారణంగా అత్యవసర సహాయార్ధం ప్రజలు వరంగల్ జిల్లా (warangal district) కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్.1800 425 3424, మొబైల్ నంబర్ 9154252936ను సంప్రదించాలన్నారు. కంట్రోల్ రూమ్ (Controlroom) నంబర్లకు వచ్చే కాల్స్ కు తక్షణం స్పందించాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్య తీవ్రతను బట్టి హుటాహుటిన చర్యలు తీసుకోవాలన్నారు.
……………………………………………..