
* తమ్మడపల్లి (ఐ)లో ఘటన
ఆకేరు న్యూస్, జనగామ : ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురైన సంఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని జఫర్గడ్ మండలం తమ్మడిపల్లి (ఐ)లో ఒంటరి మహిళ అయిన గాలి రాణి (50)తో ఆమె తల్లి తుమ్మ అన్నమ్మ (80) కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హత్య చేసి పారిపోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బంగారం కోసం దొంగలు హత్య చేశారా..? ఆస్తి తగాదాలతో ఈ హత్య జరిగిందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
……………………………