
* ఫోన్ ట్యాపింగ్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ను మొదట బయట పెట్టింది నేనే. .విచారణకు రావాలని గత వారమే సిట్ నాకు నోటీసులు ఇచ్చింది.. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పాను.. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌కు మొదటి బాధితుడిని నేనే.. కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల మీద నాకు నమ్మకం లేదు.. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదు.. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు.. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే మొత్తం వివరాలను బయట పెడతా.. కొద్ది సేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరు కానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవీ. కేంద్ర మంత్రిగా, బాధ్యత గల పౌరిడిగా తన వద్ద ఉన్న ఆధారాలు, రికార్డులను సిట్ అధికారులకు అప్పగిస్తానని తెలిపారు.
……………………………………….