
నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు.. విచారణ గురువారానికి వాయిదా
ఆకేరున్యూస్, హైదరాబాద్:బనకచర్ల ప్రాజెక్టు(BANAKACHARLA PROJECT)పై బీఆర్ ఎస్ (BRS)పార్టీ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ అభ్యంతరాలు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకుపోతోంది. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(REVANTH REDDY)ల మధ్య అవగాహన కుదిరిందని బనకచర్లను రేవంత్ గురుదక్షిణగా చంద్రబాబుకు అంకితం చేయనున్నారని హరీష్ రావు(HARISH RAO) అంటున్నారు. అసలు బనకచర్ల ప్రాజెక్టుకు బీజం వేసిందే కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపధ్యంలో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి బీఆర్ ఎస్ పార్టీ సుప్రీంకోర్టు(SUPREME COURT)లో అప్పీల్ చేయనుంది. అదే పనిమీద హరీష్ రావు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపనున్నారు,కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందనే కాంగ్రెస్ వాదనను కూడా హరీష్ రావు ఖండించారు. తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ లాంటిది అన్నారు.
…………………………………………