
* ఎన్నికల సంఘానికి ప్రియాంక సూచన
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నిరూపించాలని ఎన్నికల సంఘం కోరడంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా గాంధి (PRIYANKA GANDHI)తీవ్రంగా ఖండించింది, రాహుల్ ను (RAHUL GANDHI)తప్పు పట్టడం కాదు రాహుల్ చేసిన ఆరోపణలపే విచారణ జరిపించండి అని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఉత్తరప్రదేశ్ (UTTARPRADESH) మధ్యప్రదేశ్(MADHYAPRADESH), చత్తీస్ఘడ్(CHATHEESGADH),మహారాష్ట్ర(MAHARASTRA),హరియానా(HARIYANA),కర్ణాటక(KARNATAKA) లో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తు అక్రమాలు జరిగాయనిరాహుల్ గాంధీ ఆరోపించిన నేపధ్యంలో ఎన్నికల సంఘంరాహుల్ ఆరోపణలను తప్పుపట్టింది. దీనిపై డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్ ను కోరింది .ఎన్నికల సంఘం వ్యాఖ్యలను ప్రియాంగా తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర,హరియానా,కర్ణాటకలో వెంటనే ఎన్నికల సంఘం స్పందించి ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ప్రియాంక ప్రశ్నించారు. అసలు దర్యాప్తే చేయనప్పుడు రాహుల్ చేసిన ఆరోపణలు అసత్యాలు ఎలా అవుతాయని ప్రియాంక ప్రశ్నించారు.ఇప్పటికైనా రాహుల్ సమర్పించిన ఆధారాలతో దర్యాప్తు జరిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రియాంక హితవు పలికారు.
…………………………………………..