
– 80% పరీక్షలు, 20% ఇంటర్నల్ మార్కులు
– ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : 2025 – 26 విద్యా సంవత్సరంకు గాను పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలలో పాత పద్ధతిలోనే మార్కులు కలపాలంటూ తాజాగా నేడు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. SSC లో విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో మొత్తం 100 మార్కులకు గాను పబ్లిక్ పరీక్షల్లో మూల్యాంకనానికి 80 మార్కులు, అంతర్గత మూల్యాంకనానికి 20% మార్కులు నమోదు చేయాలంటూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అనుమతి ఇచ్చింది. గత సంవత్సరం, పాఠశాల విద్యా శాఖ 2025–26 విద్యా సంవత్సరం నుండి అమలులోకి వచ్చేలా 20 మార్కుల అంతర్గత మూల్యాంకన భాగాన్ని రద్దు చేసి SSC పబ్లిక్ పరీక్ష మార్కులను 80 నుండి 100కి సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఎంతో కాలం నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదురు చూస్తున్నటువంటి మూల్యాంకన విధానానికి ఈరోజు ఉత్తర్వులు వెలువడ్డాయి.
…………………………………………………….