
సామాజిక ఉద్యమ కెరటం
* గుండెపోటుతో తుదిశ్వాస
* ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అద్యక్షురాలు
* సామాజిక ఉద్యమాల్లో తనదైన పాత్ర
* మంగళ వారం ఉదయం 9 గంటలకు అంతిమ యాత్ర
*మహిళా సమస్యలపై 20 కి పైగా పుస్తకాల ప్రచురణ
ఆకేరు న్యూస్, హనుమకొండ : సామాజిక ఉదయమ కెరటం, ప్రజాస్వామిక రచయితల వేదిక జాతీయ అద్యక్షురాలు కవి,రచయిత అనిశెట్టి రజిత ( 68 ) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు..
సాయంత్రం సుమారు గం. 8.30 ని. ల సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రి కి తరలించారు. వైద్యులు పరిశీలించి రజిత మృతి ని ధృవీకరించారు..
సొంత ఇంటి సమస్య ఉండడంతో మృత దేహాన్ని ఎక్కడికి తరలించాలన్న సమస్య తలెత్తిందని రజిత సహచరులు వాపోయారు.అమెరికాలో ఉన్న
రిటైర్డ్ ప్రొఫెసర్, కాత్యాయని విద్మహే తన ఇంటి కి తీసుకెళ్ళి అక్కడి నుంచే అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేయాలని చెప్పారని రజిత మిత్రులు తెలియజేశారు ..
మృత దేహం మెడికల్ కళాశాలకు అప్పగింత
మరణానంతరం తన మృత దేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించేందుకు రజిత నిర్ణయించుకున్నారు..
మంగళవారం ఉదయం కాకతీయ విశ్వవిద్యాలయం ఫస్ట్ గేట్ ఎదురు గా ఉన్నప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ఇంటి ఆవరణ నుంచి అంతిమ యాత్ర ప్రారంభ మవుతుందని ప్రజాస్వామిక రచయితల వేదిక వరంగల్ జిల్లా బాధ్యులు శ్యామల, బండారి సుజాత తెలిపారు..
సామాజిక ఉద్యమ కెరటమైన అనిశెట్టి రజితకు ఘనంగా నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున అనిశెట్టి రజిత అభిమానులు, కవులు,కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున తరలి రావాలని సామాజిక ఉద్యమ కారులు రమాదేవి, బిల్లా మహేందర్,రచయితలు శ్యామల,సుజాతలు పిలుపునిచ్చారు..
* అక్షరమే ఆయుధం ..
అనిశెట్టి రజిత అవివాహితురాలు..సమాజంలో సమస్యలపై పోరాడడమే లక్ష్యంగా పని చేశారు..ముఖ్యంగా మహిళా సమస్యలపై గళమెత్తారు.సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. మహిళా సమస్యలపై లోతైన అధ్యయనం తో అనేక రచనలు చేశారు.. దాదాపు 18 పుస్తకాలకు పైగా ప్రచురించారు.. ఇంకా అనేక సమస్యలపై రజిత వ్యాసాలు రాశారు..
——