
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాపట్‌పల్లి-డోర్నకల్ బైపాస్ మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ఆగస్టు 14 నుంచి 18వ తేది వరకు పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫారాల పునరుద్ధరణ పనులు పూర్తవడంతో సెప్టెంబర్ 7వ తేది నుంచి ఏడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు తిరిగి సికింద్రాబాద్ నుంచే నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
రద్దయిన రైళ్ల వివరాలు..
గుంటూరు – సికింద్రాబాద్ (12705/12706), విజయవాడ – సికింద్రాబాద్ (12713/12714), కాజీపేట – డోర్నకల్ (67765/67766), విజయవాడ – భద్రాచలం రోడ్ (67215/67216), డోర్నకల్ – విజయవాడ (67767/67768) మధ్య నడిచే అప్ అండ్ డౌన్ రైళ్లను ఈ నెల 14 నుంచి 18వ తేది వరకు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
……………………………………