
ఆకేరు న్యూస్, అమరావతి : లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి రెండో సారి విధించిన రిమాండ్ గడువు ముగియడంతో బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) నిందితులకు బుధవారంతో రిమాండ్ ముగిసింది. దీంతో 2025 జులై 20వ తేది నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మిథున్ రెడ్డిని రోడ్డు మార్గంలో ఎస్కార్ట్ పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. ఈ కేసులో మిథున్ రెడ్డితో సహా మరో ముగ్గురి బెయిల్ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వెల్లడించనున్నది.
………………………………….