
* ఎరువుల కోసం రైతుల పడిగాపులు
*అగ్రికల్చర్ అధికారులపై హరీష్ రావు సీరియస్
ఆకేరు న్యూస్,సిద్దిపేట: సిద్దిపేట జిల్లా రాఘవాపూర్ ( RAGHAVAPUR) వద్ద రైతులు యూరియా (URIA)కోసం పడిగాపులు పడుతున్నారు.ఉదయం 5 గంటల నుండి యూరియా దుకాణాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరు నిల్చున్నారు. ఈ నేపధ్యంలో అక్కడికి చేరుకున్న హరీష్ రావుతో రైతులు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. కేసీఆర్ (KCR)ఉన్నప్పుడే మంచిగుండె సార్ ఇప్పుడు మాకు యూరియా దొరకడం లేదని వాపోయారు. ఈ సందర్భంగా హరీష్ రావు( HARISH RAO) మాట్లాడుతూ బీఆర్ ఎస్ (BRS)హయాంలో ఎప్పుడూ రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడలేదని అన్నారు. వేసవి కాలంలోనే ఎరువులు స్టాక్ పెట్టాం అని హరీష్ అన్నారు. గ్రామం నుండి రైతు కాలు బయట పెట్టకుండా.. హమాలీ, ట్రాన్స్ పోర్ట్ ఖర్చు లేకుండా రైతు సమయం వృధా కాకుండా గ్రామంలోనే ఎరువులు అందించామన్నారు.గత నాలుగు రోజులుగా రైతులు యూరియా కోసం నిరీక్షించడం బాధాకరమన్నారు.
ఓటీపీ విధానం తీసేయాలి
రైతులు ఓటీపీ విధానంతో ఇబ్బందులు పడుతున్నారని ఓటీపీ విధానాన్ని తీసేయాలని హరీష్ డిమాండ్ చేశారు. రైతులకు ఒక్క బస్తా కాకుండా అవసరమైనంత మేర యూరియాను అందించాలిని కోరారు.
బీజేపీ రైతు వ్యతిరేకి
బీజేపీ పార్టీ రైతులకు వ్యతిరేకం అని హరీష్ రావు అన్నారు. బీజేపీ (BJP)ప్రభుత్వం నానో యూరియా వాడమని చెప్తోందని దీంతో రైతులపై అదనంగా రూ. 500 భారం పడుతుందని హరీష్ రావు అన్నారు. నానో యూరియాను రైతులకు అంటగట్టడానికే కేంద్రం యూరియా కొరతను సృష్టిస్తోందని ఆరోపించారు.
8 మంది ఎంపీలు ఇద్దరు మంత్రులు ఉండి ఏం లాభం
తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు మంత్రలు పార్లమెంట్ లో ఉన్నారని వారు ఉండి ఏం లాభం అని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న ఎరువుల కొరతపై వారు ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు.రేవంత్ రెడ్డి(REVANTH REDDY)కి తిట్ల మీద ఉన్న ధ్యాస ప్రజలమీద లేదని హరీష్ అన్నారు.
………………………………………..