
* నిందితుడికి ఉరిశిక్ష విధించిన న్యాయస్థానం
* పదేళ్ల అనంతరం తీర్పు
ఆకేరు న్యూస్, నల్గొండ : బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. దాంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా విధించింది. అలాగే బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు పోక్సో కోర్టు (pocso court) ఇన్చార్జి జడ్జి రోజా రమణి తీర్పు ఇచ్చారు. 2013లో నల్గొండకు చెందిన 13 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన అనంతరం బాలికను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలవలో పడేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. పదేళ్లుగా నల్గొండ జిల్లా (Nalgonda District) కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. తాజాగా ఈకేసులో తీర్పు వెలువడింది.
…………………………………..