
ఆకేరు న్యూస్ డెస్క్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు పతకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 233 మందికి పోలీస్ గ్యాలంటరీ పతకాలు, 99 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు. ఇందులో తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ప్రెసిడెంట్ మెడల్స్కుఏఎస్ఐ సిద్ధయ్య, నిడమానురి హుస్సేన్ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు.
……………………………………….