
ఆకేరున్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యా సంస్థల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవ నజరానా ప్రకటించింది. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్‌లో జిల్లా టాపర్లుగా నిలిచిన ఒక్కో విద్యార్థికి రూ.10వేల నగదు ప్రోత్సాహకం ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాలో పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు, ఇంటర్మీడియట్లో టాపర్లుగా నిలిచిన ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలకు నజరానా అందజేస్తారు. ఈ విద్యార్థులను జిల్లా స్థాయిలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సత్కరించి, ప్రశంసాపత్రం కూడా అందజేస్తారు.
…………………………………………….