
* వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు
* జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ఘన విజయం
అకేరు న్యూస్, కడప : వైసీపీ అధినేత జగన్ కంచుకోటలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో (ZPTC BY Election) టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (Latha Reddy) 6,735 ఓట్లతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి (Hemanth Reddy) డిపాజిట్ కూడా కోల్పోయారు. కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో లతారెడ్డి గెలిచారు. జగన్ కంచుకోటలో టీడీపీ విజయకేతనం రాజకీయాల్లో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. జనరల్ ఎన్నికల్లో కూడా పులివెందులలో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు జగన్ కూడా ఓటమి చూవిచూడక తప్పదని హెచ్చరిస్తున్నారు.
………………………………………