
* లియాండర్ పేస్ కు తండ్రి
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రముఖ హాకీ మాజీ ఆటగాడు వేస్ పేస్(80) కన్నుమూశారు. ఈయన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తండ్రి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 1945లో గోవాలో వేసే పేస్ జన్మించారు. 1972లో జర్మనీ, మ్యూనిచ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించడంలో వేస్ పేస్ (Ves Paes) కీలక పాత్ర పోషించారు. హాకీ ఆటలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ, మిడ్‌ఫీల్డర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హాకీ ఆటతో పాటు వైద్య రంగంపై కూడా వేస్ పేస్‌కు ప్రత్యేక ఆసక్తి ఉండేది. స్పోర్ట్స్ మెడిసిన్ (Sports Medicine) లో నైపుణ్యం సంపాదించి, అనేకమంది క్రీడాకారులకు వైద్య సహాయం అందించారు. హాకీ క్రీడాకారుడిగా రిటైర్ అయిన తరువాత ఆటగాళ్లకు మెడిసిన్ డాక్టర్‌గా సేవలందించారు.
………………………………