
* ఎన్ హెచ్ ఆర్ సి. ములుగు జిల్లా అధ్యక్షులు పేట్టెం రాజు
ఆకేరు న్యూస్,ములుగు : సమాజంలో రోజురోజుకు అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ప్రతి పౌరుడు బాధ్యతగా అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) ములుగు జిల్లా అధ్యక్షులు పెట్టేం రాజు పిలుపునిచ్చారు. ఎన్ హెచ్ ఆర్ సి వెంకటాపురం మండల అధ్యక్షులు జయ రాయుడు అధ్యక్షతన జరిగిన విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) నేషనల్ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ బలమైన లీగల్ ప్రొసీజర్, ప్రోటోకాల్ సిస్టంతో పేద ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ సంస్థ ముందుకు పోతుందని ఆయన అన్నారు. బలమైన ప్రజా వేదికను నిర్మించి రాజ్యాంగ చట్టాలను అనుసరించి తమ సంస్థ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు తావులేని సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న ప్రయత్నాల్లో విద్యావంతులు, మేధావులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. వెంకటాపురం మండల కమిటీ నాయకులను ఆయన అభినందించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గోగులమూడి హరికృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ పెన్ను పేపర్ ద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయ, అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికార దృష్టికి తీసుకువస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజ సేవలో నిస్వార్ధంగా పనిచేస్తూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి తమ సంస్థ సరైనవేదిక అని ఆయన తెలిపారు. సంస్థలో క్రియాశీలకంగా పనిచేసే వారికి త్వరలో గుర్తింపు కార్డులను, భారత చట్టాలకు సంబంధించిన గైడ్ లెన్స్ కూడా ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గుర్రం సుభాషిని, మండల ఉపాధ్యక్షురాలు పద్మ, మండల నాయకులు, గ్రామ కమిటీల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
……………………………………