
ఆకేరున్యూస్, వరంగల్ : కాకతీయ కళావైభవం.. 13వ శతాబ్దం నాటి చరిత్రకు నిదర్శనమైన రామప్ప టెంపుల్.. స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఇలా ధగధగలాడుతోంది. ఆలయ ఎర్ర ఇసుకరాయి.. గ్రానైట్.. కలప.. నిర్మాణం మొత్తం త్రివర్ణ కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. ఒక విలక్షణమైన సౌందర్యంతో ప్రకాశిస్తోంది. సందర్శకులను ఇట్టే ఆకట్టుకునే రామప్ప ఆలయ నిర్మాణ శైలి.. పంద్రాగస్టు వేడుకల వెలుగుల్లో మరింత ఆకర్షిస్తోంది. చారిత్రక వైభవాన్నే కాదు.. స్వాతంత్య్ర సంబురాన్ని చాటుతోంది.
…………………………………….