
* అలరింపజేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు…
* జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి పొంగులేటి
ఆకేరున్యూస్,వరంగల్ : వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో శుక్రవారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మంత్రి పొంగులేటి ప్రశంసా పత్రాలు అందించారు.. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు తెలియజేస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ లను మంత్రి పొంగులేటి గారితో కలిసి ఎమ్మెల్యే నాగరాజు గారు సందర్శించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది స్వాతంత్ర సమరయోధులు ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు….
………………………………………..