
* రజనీ సార్ కంటే రూ.కోట్లు ఎక్కువ కాదు
* కూలీ సినిమా పారితోషికంపై అమీర్‌ఖాన్
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajanikanth), నాగార్జున(Nagarjuna), ఆమీర్‌ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ సినిమా థియేటర్లలో నడుస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. ఈ సినిమాలో ఆమీర్‌ఖాన్ అతిథి పాత్రలో అలరించారు. అయినప్పటికీ సినిమాకు ఆయన పాత్ర టర్నింగ్ పాయింట్. దీంతో ఆ పాత్ర కోసం ఆమీర్‌ఖాన్ (Aamir khan) రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. దాహా అనే డాన్ పాత్రలో కనిపించిన తాను అందుకోసం రూ.20 కోట్లు తీసుకున్నాన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. కూలీ సినిమా కోసం తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నారు. తలైవర్(రజనీ)పై ఉన్న ప్రేమని డబ్బులతో వెలకట్టలేననని, కూలీ టీమ్ పట్ల ఉన్న ప్రేమ, గౌరవం కారణంగానే తాను ఈ సినిమాలో ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించానని వివరణ ఇచ్చారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ వచ్చి కథ చెప్పకుండానే తాను ఈ ప్రాజెక్టుకు అంగీకరించానని, ఇలా స్క్రిప్ట్ వినకుండా ఒక సినిమాకు ఓకే చెప్పడం తన కెరీర్లో ఇదే తొలిసారని ఆమీర్ తాజాగా స్పందించారు.
………………………………………