
– కరీంనగర్ ఎంపీ,కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్
ఆకేరు న్యూస్,కమలాపూర్ : మండలంలోని గ్రామాల ప్రగతికి తోడ్పడుతానని, అందుకు కావలసిన నిధులను సమకూర్చి కమలాపూర్ మండలానికి అండగా ఉంటానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీంపల్లి గ్రామ బీజేపీ నాయకులు బండి సంజయ్ ను శనివారం కరీంనగర్లో కలిశారు.ఈ సందర్భంగా ఆయన భీంపల్లి గ్రామానికి ఓపెన్ జిమ్ ,స్వర్గ రథాన్ని15రోజుల్లో ఇస్తానని హామీ ఇచ్చారు.మండలంలోని ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు సంబందించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం,బోర్ సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు.ప్రజలు స్పష్టంగా బీజేపీ పార్టీ వైపు ఉన్నారని, కలిసికట్టుగా బీజేపీ పార్టీ నీ ముందుకు తీసుకెళ్లాలని, మండలంలో అత్యధిక స్థానాల్లో సర్పంచులు,ఎంపీటీసీ,ఎంపీపీ,జడ్పిటిసి స్థానాలను కైవసం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్, భీంపల్లి గ్రామం బూత్ అధ్యక్షులు వాసాల సత్యం, సులుగూరి శ్రీనివాస్,ఎలుగం రాజు ఎగ్గోజు శ్రీనివాస్, సముద్రాల మొగిలి,ఆకినపల్లి రవీందర్,బండ సుధాకర్,బండ కొమురయ్య, చింతల రంజిత్,తోట సాగర్, తోట రాంప్రసాద్ పాల్గొన్నారు.
……………………………………………….