
* స్థానిక సంస్థలు,, బీసీ రిజర్వేషన్లపై చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం ఎటూ తేల్చకపోవడంతో ఎన్నికలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నదనేది ఆసక్తి రేపుతున్నది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Maheshkumar goud) ఇటీవల ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హై కోర్టు చెప్పినట్లు సెప్టెంబర్ నెలాఖరుకు ఎన్నికలు పూర్తి చేయాలి కానీ, ఆ పరిస్థితి లేనప్పుడు గడువు కోరతామన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
ఈ తరుణంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం
తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీసీసీ) సమావేశం ఈ నెల 23న సాయంత్రం ఐదు గంటలకు గాంధీ భవన్లో నిర్వహించబోతున్నది. ఈ మేరకు పీఏసీ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు. కాగా, ఆదివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితోమహేశ్కుమార్ గౌడ్ సమావేశం అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (Hanumatha Rao) తదితర నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
…………………………………………