
* హైదరాబాద్ లో ఘనంగా గంగా తెప్పోత్సవం
అకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘనంగా గంగా తెప్పోత్సవం జరిగింది. ఖైరతాబాద్ నుండి ట్యాంక్ బండ్ ఏడు గుడులు ( ఏడు గుళ్ళు) వరకు శోభాయాత్ర కనుల పండువగా సాగింది. వందలాదిగా తరలివచ్చి మహిళలు యాత్రలో పాల్గొన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆద్యంతం పండుగ వాతావరణం వెళ్లి విరిసింది. పోతరాజుల సందడి.. ఉత్సాహంగా తెప్పోత్సవ వేడుక కొనసాగింది. ఉత్సవాన్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.
……………………………………