
* నవిత ఆహ్వానం మేరకు పెళ్లికి హాజరైన కేటీఆర్
ఆకేరు న్యూస్ ,డెస్క్: : ఓ ఆడబిడ్డ కోరికను తీర్చడం అన్నయ్యగా తన బాధ్యత అని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ( MLA KTR)అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లి కూతరు నవిత తనను పెళ్లికి ఆహ్వానించిందని ఆమె పెళ్లికి హాజరుకావడం అన్యయ్యగా తన బాధ్యత అన్నారు. అసలైన తెలంగాణ బిడ్డలే బీఆర్ ఎస్ కు బలం అన్నారు. నవిత తండ్రి ధ్యానబోయిన నర్సింహులు బీఆర్ ఎస్ లో క్రియాశీలకంగా పనిచేశారు. కరోనా సమయంలో నర్సింహులు చనిపోగా కుమారుడు నరేష్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయింది, కాగా నవిత పెళ్లి ఆదివారం జరుగగా కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను అని అన్నారు.ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది…నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి అన్నారు.ప్రజలతో ఉన్న అనుబంధం రాజకీయాలకు మించినది.ఇలాంటి సందర్భాలు నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి.. మనందరికీ ఒకటే కుటుంబం అని అన్నారు.చెల్లెలు నవిత-సంజయ్ దంపతుల కొత్త జీవిత ప్రయాణం సంతోషం, ప్రేమ, ఆశీర్వాదాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
……………………………………….