
* కూకట్ పల్లిలో దారుణం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పన్నేండేళ్ల బాలికను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో…దుండగులు ఇంత దారుణానికి ఎందుకు ఒడి గట్టారో తెలియదు కాని మానవత్వం మంటగలిసిన ఈ ఘటన కూకట్ పల్లి సంగీత్ నగర్లో జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బాలికను అమానుషంగా చంపారు.హత్య గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. హత్యకు గురైన 12 ఏళ్ల బాలిక పేరు సహస్ర..సహస్ర తల్లి రేణుక, తండ్రి కృష్ణలు నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి సమస్ర కాకుండా ఇంకో కొడుకు ఉన్నాడు, హత్య జరిగిన సమయంలో కొడుకు ఇంట్లో లేడు. బాలిక తల్లిదండ్రులు ఆఫీస్కు వెళ్లిన తరువాత ఇంట్లోకి ప్రవేశించి బాలికను హత్య చేసి పరారయ్యారని పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………….